New Projects

బిగ్ బాస్ నుండి రాగానే శ్రీముఖి పెళ్లి | Anchor Sreemukhi Given Clarity on Her Marriage | Gossips9

బిగ్ బాస్ నుండి రాగానే శ్రీముఖి పెళ్లి … వరుడెవరో తెలుసా?

Sreemuki Marriage,Gossips9
బిగ్ బాస్ నుండి రాగానే శ్రీముఖి పెళ్లి … వరుడెవరో తెలుసా?

శ్రీముఖి ...ప్రస్తుతం బుల్లితెర అభిమానులకి బాగా పరిచయం ఉన్న పేరు ఇది. తన వాక్చాతుర్యం తో బుల్లితెరపై అందరిని మెప్పించి లక్షల్లో అభిమానులని సంపాదించుకున్న యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు. పటాస్ షో ద్వారా శ్రీముఖి కి ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ షో నే కాకుండా శ్రీముఖి పలు షోస్ కి , ఫంక్షన్స్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ఇకపోతే ప్రస్తుతం శ్రీముఖి తెలుగు బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ౩లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్లో తనదైన అట తీరుతో అందరిని ఆకట్టుకుంటూ ,పక్కా గేమ్ ప్లాన్ అమలుచేస్తూ టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.ఈ నేపథ్యంలో శ్రీముఖి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే .. బుల్లితెర యాంకర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి త్వరలోనే పెళ్ళి చేసుకోబోతుందన్నది ఆ వార్త. అయితే వరుడు ఎవరన్న వివరాలు మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ, అతడు కూడా ఇండస్ట్రీకి చెందినవాడేనని సమాచారం. ఒకే రంగానికి చెందినవారు కావడంతో, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని, చివరికి పెళ్ళి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. తమ ప్రేమ గురించి కుటుంబసభ్యులకు కూడా వెల్లడించారని, వారు కూడా వీరి  పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినపడుతుంది.పెళ్లి తరువాత కూడా తాను యాంకర్‌గా కొనసాగుతానని శ్రీముఖి పెట్టిన కండిషన్ కి సైతం అంగీకరించడంతో, శ్రీముఖి మరో ఆలోచన చేయకుండా పెళ్ళికి రెడీ అనేసినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్న ఈ జంట కొన్నాళ్ళు ఇలాగే వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని… వీలైతే వచ్చే ఏడాదిలో పెళ్ళి చేసుకుందామని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కానీ , శ్రీముఖి కుటుంబ సభ్యులు మాత్రం బిగ్ బాస్ షో నుండి శ్రీముఖి బయటకి రాగానే పెళ్లి చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఏదేమైన అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే మన బుల్లితెర రాములమ్మ ఒక ఇంటికి కోడలు  పెళ్లి పీటలు ఎక్కబోతుంది అనమాట ... త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్న శ్రీముఖి కి కామెంట్స్ ద్వారా బెస్ట్ విషెస్ ని తెలియ చేయండి.

No comments:

Post a Comment