అక్కినేని
నాగార్జున ... పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో
పోటీ పడుతుంటారు ఆయన. కేవలం అందం విషయంలోనే
కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా
అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు
అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు
హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. ఇటీవలే
'బిగ్ బాస్' రియాలిటీ షో
సీజన్ -3కి హోస్ట్గా
బాధ్యతలు చేపట్టిన ఆయన..ఇప్పటికీ సక్సస్
ఫుల్ కెరీర్ ని లీడ్ చేస్తున్నారు.
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్ని
పెద్ద కుటుంబాలు ఉన్నా.. ఆప్యాయతలను పంచుకుంటూ.. వివాదాలు లేకుండా ఆనందంగా కలసి జీవించాలి అంటే
అక్కినేని ఫ్యామిలీ తరువాతే. అప్పట్లో అక్కినేని గారు బతికి ఉన్నప్పుడు
నాగ్ ఫ్యామిలీ అంతా వారానికి ఒకసారి
తప్పకుండా కలిసేది. అయితే ఆయన మరణం
తరువాత ఇలాంటి మీటింగ్స్ బాగా తగ్గిపోయాయి.నిజం
చెప్పాలి అంటే ఇంట్లో అందరూ
బిజీగా ఉండటంతో నాగ్ కుటుంబ సభ్యులే
5 మంది కలసి బయటికి రావడం
చాలా అరుదు అయిపోయింది. అయితే
రీసెంట్ గా జరిగిన నాగ్
పుట్టినరోజు సందర్భంగా సమంతా అలాంటి మీటింగ్
ని అరేంజ్ చేసింది. అది కూడా ఆషామాషీ
గా కాదు. స్పెయిన్ లో.
ఆగస్ట్ 29 న నాగ్ పుట్టినరోజు
కావడం, అందులోను ఆయన 60 వ పదులోకి అడుగు
పెట్టడం తో నాగ్ బర్త్
డే ని సమంతా..చైతు,
అఖిల్ ని ఒప్పించి అక్కడ
మావయ్య షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని
అక్కడ ప్లాన్ చేసిందట.అందుకే మొత్తం
5 రోజుల పాటు నాగ్ ఫ్యామిలీ
అన్ని షూటింగ్స్ ని క్యాన్సిల్ చేసుకొని..
స్పెయిన్ చెక్కేసి.. బాగా ఎంజాయ్ చేసింది.
దీని కారణంగానే నాగ్ ఒక వారం
బిగ్ బాస్ ని కూడా
మిస్ చేశారు. అయితే స్పెయిన్ లో
మావయ్య పుట్టినరోజు వేడుక నాడు సమంతా
ఇచ్చిన ఒక గిఫ్ట్ చూసి
కన్నీరు పెట్టుకున్నారట. ఆ గిఫ్ట్ ఒక
ఉమ్మడి కుటుంబాన్ని సూచించే విధంగా ఉందట. దాని కింద
ఇన్నాళ్లు మీరు కష్టపడి మమ్మల్ని
ఆనందంగా ఉంచారు. ఇక మీరు ఆనందంగా
ఉండండి. అందరిని కలిపి ఉంచే బాద్యత
నాది. మిమ్మల్ని ఆనందంగా చూసుకునే బాధ్యత మా అందరిదీ అని
ఆ గిఫ్ట్ మీద రాసుందట. తన
కుటుంబ బాధ్యత తీసుకోవడానికి కోడలు సిద్ధంగా ఉండటం,
తనకి భరోసా ఇచ్చేలా గిఫ్ట్
ఇవ్వడంతో నాగ్ కూడా చాలా
ఆనందానికి లోనయ్యారట. వెంటనే సమంతాని పట్టుకొని నాగ్ ఏడ్చేశారట. ఏదేమైన
అత్త మామని సొంత కోడలిగా
చూసుకుంటున్న సమంతా నిజంగా గ్రేట్.
మరి ఈ విషయంలో మీ
అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
No comments:
Post a Comment