సాహో
బాగలేదని నెగిటీవ్ ప్రచారం చేస్తుంది పవన్ ఫ్యాన్సే! వారికి
బుద్ధి రాదా? పవన్ ఫ్యాన్స్
పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్.
రెండున్నరేళ్ల
పాటు కష్టపడి పని చేసి.. సినిమా
మీద నమ్మకంతో రూ.350 కోట్లు ఖర్చు పెట్టి మరీ
'సాహో' చిత్రాన్ని రూపొందించారు నిర్మాతలు. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజీట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా
కోసం హాలీవుడ్ నిపుణులు పని చేశారు. హైటెక్నికల్
వాల్యూస్ తో రూపొందిన ఈ
సినిమాపై సోషల్ మీడియాలో నెగెటివ్
కామెంట్స్ చేస్తున్నారు. వీటిని ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ అభిమాన
హీరోని తెరపై చూసుకుంటూ నెగెటివ్
కామెంట్స్ సంగతి మర్చిపోయారు.అయితే
సోషల్ మీడియాలో జరిగిన ఈ నెగిటీవ్ ప్రచారం
అయితే చాలా గట్టిగానే జరిగింది.అయితే ఇప్పుడు ఈ
కామెంట్స్ ని తన వివాదం
కోసం వాడుకుంటోంది సినీ నటి శ్రీరెడ్డి.
'సాహో' సినిమా ఎలా ఉందని..? పోస్ట్
పెట్టిన ఈమె.. సినిమా ఫ్లాప్ అని చాలా మంది
కామెంట్స్ చేస్తున్నారని.. వాళ్లు ఎవరో తనకు తెలుసునని.. పవన్
కళ్యాణ్ ఫ్యాన్స్ పనిగట్టుకొని మరీ సినిమాపై ఫ్లాప్
కామెంట్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.పవన్ ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ.. 'మీరు
మారరా..? ప్రభాస్ సినిమాపై పడి ఏడుస్తున్నారు..' అంటూ తనదైన
భాషలో మండిపడింది. సోషల్ మీడియాలో చాలా మంది పవన్ ఫ్యాన్స్
ప్రభాస్ ని విష్ చేస్తూ
పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఆ
పోస్ట్ లు శ్రీరెడ్డి కంటపడినట్లు
లేవు! మరి ఈ విషయంలో
మీ అభిప్రాయం ఏమిటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
నిజంగానే సాహో మూవీ పై
నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారా? శ్రీరెడ్డి కామెంట్స్ తో మీరు ఏకీభవిస్తారా?
మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
|
No comments:
Post a Comment