బాహుబలి
2 తర్వాత ఆల్ మోస్ట్ రెండున్నర
ఏళ్ల టైం తీసుకుని 350 కోట్ల
రేంజ్ బడ్జెట్ తో భారీ ఎత్తున
రూపొందించిన సాహో సినిమా తో
ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు యంగ్ రెబల్ స్టార్
ప్రభాస్, మొదటి రోజు ఆన్
లైన్ టికెట్ సేల్స్ తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ సేల్
అవ్వడం తో రికార్డ్ బ్రేకింగ్
ఓపెనింగ్స్ కన్ఫాం అయ్యాయి, దాంతో కొన్ని ఎక్స్
ట్రా థియేటర్స్ ను కూడా యాడ్
చేయగా అక్కడ ఆక్యుపెన్సీ అదిరి
పోయే రేంజ్ లో ఉంది.ఇక తొలి రోజు
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల
సమయానికి ఆక్యుపెన్సీ ఓవరాల్ గా 95% వరకు ఉండగా ఈవినింగ్
అండ్ నైట్ షోలలో వచ్చే
సరికి కొన్ని చోట్లా ఆక్యుపెన్సీ తగ్గింది, అయినా 92% వరకు ఆక్యుపెన్సీ ఓవరాల్
గా కంటిన్యు అవ్వడం తో హైర్స్ కాకుండానే
28 కోట్ల రేంజ్ షేర్ పక్కా
అని అంటున్నారు.అది మాగ్జిమం ఎంతవరకు
వెళుతుందో అఫీషియల్ కలెక్షన్స్ లో తెలుస్తుంది, కర్ణాటక
లో రోజు మొత్తం సాలిడ్
గా హోల్డ్ చేసిన సినిమా 7 కోట్లకు
పైగానే షేర్ ని అక్కడ
సాధించే అవకాశం పుష్కలంగా ఉందని సమాచారం, హిందీ
లో సినిమా బుకింగ్స్ టాక్ కోసం ఎదురు
చూడగా…హిందీ టాప్ వెబ్
సైట్స్ అన్నీ పనిగట్టుకుని సినిమాకి
నెగటివ్ రివ్యూ లు ఇచ్చాయి, దాంతో
ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడే చాన్స్
ఉన్నా ఫస్ట్ డే 18 కోట్లకు
పైగా నెట్ కలెక్షన్స్ పక్కా
అని అంటున్నారు. ఇక తమిళ్ అండ్
మలయాళం లో కలెక్షన్స్ గ్రోత్
పెద్దగా లేదనే చెప్పాలి. ఓవర్సీస్
ప్రీమియర్ షోలతో 0.92 మిలియన్ ని క్రాస్ చేసింది
సినిమా. ఒక్కో దగ్గర 1 మిలియన్
ని కూడా టచ్ చేసినట్టు
తెలుస్తోంది. సో మొదటి రోజు
కలెక్షన్స్ ఆడిరిపోగా.. మొత్తం మీద ఇండియా లో
50 కోట్ల నుండి 55 కోట్ల రేంజ్ లో
షేర్ అందుకునే చాన్స్ ఉందని, వరల్డ్ వైడ్ గ్రాస్ 90 కోట్ల
నుండి 100 కోట్ల రేంజ్ లో
ఉండొచ్చని అంటున్నారు. ఇది చరిత్రకెక్కె రికార్డ్
అని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్
లెక్కలు ఏ విధంగా ఉంటాయో
చూడాలి.మరి ఈ విషయంలో
మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుయచేయండి.
No comments:
Post a Comment