యంగ్
టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్
రాంచరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం
‘ఆర్.ఆర్.ఆర్’. ఈ
చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ వేగంగా
జరిగినప్పటికీ తరువాత నుండీ డిలే అవుతూ
వస్తుంది. చరణ్ కి గాయం
కావడం, ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరకకపోవడంతో
కాస్త డిలే అయింది. అయితే
సినిమాని 2020 జూలై
30 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు కాబట్టి.. వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ
చిత్రంలో చరణ్ కంటే ఎక్కువ
ప్రాధాన్యత ఎన్టీఆర్ కే రాజమౌళి ఇస్తున్నట్టు
స్పష్టమవుతుంది. అయితే ఈ వార్త
భయటకి రావడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే
చరణ్ షూటింగ్ లో తక్కువ పాల్గొంటున్నాడు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ ది
అల్లూరి సీతారామ రాజు పాత్ర.నిజానికి
ఈ పాత్ర గురించి
కొత్తగా చెప్పడానికి ఏమిలేదు. ఇప్పటికే చాలా సినిమాలు తీశారు.కానీ తెలంగాణా పోరాట
వీరుడు కొమరం భీం గురించి
ఎవ్వరికీ పెద్దగా తెలీదు. కాబట్టి ఈ పాత్ర మీదే రాజమౌళి
ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
సినిమాకి కొమరం భీం క్యారెక్టర్
ప్రాణం కాబట్టే రాజమౌళి ఆ పాత్రకి ఎన్టీఆర్
ను ఎంచుకోవడం జరిగింది అని తెలుస్తోంది.కొమరం
భీం రఫ్ అండ్ టఫ్
గా ఉంటాడని మనం పుస్తకాల్లో చదువుకున్నాం.
అతని నైజం కూడా అదే
అని తెలిసిందే. కొమరం భీం ను
కొత్తగా చూపించేందుకు రాజమౌళి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం
కొమరం భీం..... అదే ఎన్టీఆర్ పాత్రకు
సంబందించిన ఎపిసోడ్స్ ను బల్గెరియా లో
షూట్ చేస్తున్నాడు. అక్కడ ఎన్టీఆర్ పాత్రకి
సంబంధించి పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు.‘సాహో’ స్టైల్ లో
హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ సమక్షంలో ‘ఆర్.ఆర్.ఆర్’
యాక్షన్ సీన్ల చిత్రీకరణ జరుగుతుంది.
సెప్టెంబర్ మొదటి వారం వరకూ
అక్కడే షూటింగ్ జరుగబోతుందట. అక్టోబర్ 22 న కొమరం భీం
పాత్ర కు సంబంధించిన ఫస్ట్
లుక్ ను విడుదల చేయబోతున్నారని
సమాచారం. ఇక 400 కొట్ల భారీ బడ్జెట్
తో డీ.వీ.వీ.దానయ్య నిర్మిస్తున్నాడు.మరి చరణ్ పాత్ర
కన్నా. ఎన్టీఆర్ పాత్ర ఎక్కువుగా ఉండటం
పై మీ అభిప్రాయాలను కామెంట్స్
రూపంలో తెలియ చేయండి.
No comments:
Post a Comment