New Projects

Polavaram Project Name Change As YSR Polavaram | జగన్ సంచలన నిర్ణయం | Gossips9


ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది

polavaram project name change


మేరకు రాష్ట్రంలోని పలువురు వైఎస్సార్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన నేత సత్యం యాదవ్ పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలోనే ప్రారంభం అయ్యాయని, పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ చిరకాల వాంఛ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వరంగా పేర్కొనే పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెడితేనే సార్థకత ఉంటుందని అన్నారు.

ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టుతో వైఎస్సార్ కు అవినావ బంధం ఉంది. ప్రాజెక్టు సైట్క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితులకు భూముల కేటాయింపులు అన్నీ కూడా వైఎస్ హయాంవేనని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటారు. అంతే కాదు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జల సంఘానికి కూడా ఆయన వినతిపత్రం సమర్పించారని వైఎస్ సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు వైఎస్సార్ ప్రాజెక్టుగా పేరు పెట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీలోని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దీనికి ఒక వ్యక్తి పేరు పెట్టాలి అంటే కేంద్ర స్థాయిలో పర్మిషన్స్ అవసరం. వైసీపీ అధికారంలో ఉండి, మిత్ర పక్షమైన బీజేపీ అధికారంలో ఉన్న ఇలాంటి సమయంలో పర్మిషన్స్ తెచ్చుకోవడం అంత కష్టం కాదు. ఆయితే పొలవరం కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్ట్. దీని వల్ల ఆంద్రప్రదేశ్ లో చాలా ప్రాంతలకి నీరు ఖచ్చితంగా అందుతుంది. అలాంటి పొలవరకి కనుక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడితే ఇక తెలుగు ప్రజానీకం ఆయన్ని జీవితాంతం మర్చిపోలేను
 ఇది మిగతా పార్టీలకి పెద్డ సమస్య అవుతుంది. అందుకే ఇప్పుడు కేంద్ర స్థాయిలో బీజేపీ పర్మిషన్ ఇస్తుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ అన్ని అనుకన్నట్టు జరిగి పోలవరానికి వైఎస్ పేరు పెడితే కనుక అది టీడీపీ కి మింగుడు పడని విషయం అవుతుంది అని చెప్పుకోవచ్చు. మరి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.

Video 


No comments:

Post a Comment