షాక్ ఇస్తోన్న అనుష్క
అనుష్క..
ఒక్క తెలుగులోనే కాదు టోటల్ సౌత్
లో హీరోయిన్ గా ఈమెకి ఉన్న
క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో
కూడా నిర్మాతలకు కోట్ల లాభాలు సంపాదించి
పెట్టిన ఈ అరుంధతి బాహుబలి
తరువాత సినిమాలకి బ్రేక్ తీసుకొని సైలెంట్ గా ఉంటుంది. అయితే
ఇంతా సాధించి..
సౌత్
స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్
సొంతం చేసుకున్న అనుష్క కెరీర్ను ఒక్క సినిమా
ఇబ్బందుల పాలు చేసింది. గ్లామర్
హీరోయిన్గా, లేడీ ఓరియంటెడ్
సినిమాల హీరోయిన్గా మంచి ఫాంలో
ఉన్న సమయంలో అనుష్క, సైజ్ జీరో సినిమా
కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో
అనుష్క సినీ కెరీర్ ఇబ్బందుల్లో
పడింది.
సైజ్
జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క
చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ తరువాత చేసిన
సింగం 3, నమో వేంకటేశాయ సినిమాల్లో
ఆమె లుక్పై విమర్శలు
వినిపించాయి. దీంతో లాంగ్ గ్యాప్
తీసుకున్న అనుష్క, స్లిమ్ లుక్లో ఓ
ఫోటో షూట్ చేసి రిలీజ్
చేశారు. వెంటనే నిశబ్ధం అనే బహు భాషా
చిత్రాన్ని ప్రారంభించారు.
ప్రస్తుతం
ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న
స్వీటీ తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో
కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటోలు చూసిన
స్వీటీ అభిమానులు షాక్ అవుతున్నారు. ఫోటో
షూట్లో స్లిమ్గా
కనిపించిన అనుష్క, తాజా ఫోటోలో చబ్బీ
చబ్బీగా దర్శనమిచ్చారు. బాగా లావు అయిపోయి..
బుగ్గలు ఉబ్బిపోయి.. టోటల్ షేప్ ఔట్
అయిపోయిన అనుష్క ని చూసి ప్రేక్షకులే
కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ కి
గురి అవుతున్నాయి. వైట్ షర్ట్, బ్లూ
జీన్స్ లో అనుష్కని అంత
లావుగా చూస్తుంటే ..ఒకప్పటి స్పార్క్ అస్సలు కనిపించడం లేదు. కొంత మంది
నెటీజన్స్ అయితే ఏకంగా అనుష్కని
ఆంటీ అనేస్తున్నారు.దీంతో నిశబ్ధం సినిమాలోనూ
అనుష్క లుక్ నిరాశపరుస్తుందన్న అనుమానాలు
కలుగుతున్నాయి. మరి ఈ విషయంలో
మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
|
No comments:
Post a Comment