సుమని ఆ విషయంలో అస్సలు పట్టించుకోను.
తెలుగు
టెలివిజన్ తెరపై నంబర్ వన్
యాంకర్ ఎవరు అనగానే..
టక్కున
గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ.సుమ యాంకరింగ్ అంటే..
ఇంటిల్లిపాదీ టీవీ ముందు కూర్చొంటారు.
ఆమె యాంకరింగ్కు అంత పాపులారిటీ
ఉంది.టీవీ షోలే కాదు..
సినిమా ఈవెంట్స్కు కూడా సుమ
యాంకరింగే కావాలని చాలామంది హీరోలు కోరుకుంటారు. సుమ నో అంటే
తప్ప ఆ ఛాన్స్ మరొకరికి
వెళ్లదు. మరి అంత పాపులారిటీ,డిమాండ్ ఉన్న సుమ రెమ్యునరేషన్
ఎంత ఉండాలి..? ఈ విషయం గుతించి
తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంటుంది. అయితే
ఇదే విషయంపై సుమ భర్త రాజీవ్
కనకాల ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సుమ రెమ్యునరేషన్ గురించి
గానీ, తన సంపాదన గురించి
గానీ అసలు పట్టించుకోనని చెప్పారు.
సుమ రెమ్యునరేషన్ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని
అన్నారు. సుమ తన కెరీర్లో ఆ స్థాయికి
వెళ్లడం వెనుక తాను చేసిందేమీ
లేదని.. ఆ క్రెడిట్ తానుతీసుకోనని
చెప్పారు.
అయితే
సినీ ఇండస్ట్రీలో తన తండ్రి దేవదాస్ కనకాలకు ఉన్న ఇమేజ్.. సుమకు
తెలియకుండానే ఆమె కెరీర్కు
ఉపయోగపడిందన్నారు.సక్సెస్ఫుల్గా యాంకర్
తాను రాణించడం వెనుక రాజీవ్ సపోర్ట్
ఉందని సుమ చెప్పడం ఆమె
గొప్పదనం అన్నారు. అయితే సుమ తన
కెరీర్ను కొనసాగించడానికి తన
కుటుంబం ఆమెకు కావాల్సినంత స్పేస్
అయితే ఇచ్చామని అంతకు తప్పించి సుమకి
నేను గొప్పగా చేసింది లేదంటూ రాజీవ్ కుండ బద్దలు కొట్టినట్టు
అసలు నిజాలని బయటపెట్టారు. ఏదేమైన నెంబర్ వన్ యాంకర్ గా
దూసుకొని పోతున్న ఒక ఫీమేల్ యాంకర్
భర్తగా ఆమె రెమ్యునరేషన్ ఎంతో
తనకి తెలియదు అని నిజాన్ని బయయపెట్టిన
రాజీవ్ పై ప్రశంశలు కురుస్తున్నాయి.
అంటే రాజీవ్ సుమ సంపాదన కోసం
ఎదురు చూడటం లేదని, తన
స్వశక్తితోనే సంపాదించడానికి ఇష్ట పడుతున్నారు అని
అర్థం చేసుకోవచ్చు. ఏదేమైన రాజీవ్ ఒప్పుకున్నా ,ఒప్పుకోకపోయినా సుమ సక్సస్ లో
ఆయన పాత్ర కీలకం అని
చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో
మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
No comments:
Post a Comment